Nov 25,2022 15:17

ఆక్లాండ్‌: మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆధిక్యం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్య ఛేదనను కివీస్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పయి 47.1 ఓవర్లలో 309 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ (145లి: 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు), కేన్‌ విలియమ్సన్‌ (94లి: 98 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌) నాలుగో వికెట్‌కు 221 పరుగులు జోడించి కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. మిగతా బ్యాటర్లలో ఫిన్‌ అలెన్‌ 22, డేవన్‌ కాన్వే 24, డారిల్‌ మిచెల్‌ 11 పరుగులు చేశారు. భారత బౌలర్లు ఉమ్రాన్‌ మాలిక్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక వికెట్‌ తీశారు. అంతకుముందు శిఖర్‌ ధావన్‌ (72), శుభ్‌మన్‌ గిల్‌ (50), శ్రేయస్‌ అయ్యర్‌ (80) అర్ధశతకాలతోపాటు వాషింగ్టన్‌ సుందర్‌ (37లి), సంజూ శాంసన్‌ (36) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసిన విషయం తెలిసిందే.