
ఇంటర్నెట్‌డెస్క్ : ప్రముఖ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం 'శాకుంతలం'. ఈ చిత్రంలో సమంతను గ్రాండ్ లుక్‌లో చూపించేందుకు చిత్రయూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుందని సమాచారం. సమంత ప్రతి ఫ్రేమ్‌లో యువరాణిలా కనిపించేందుకు మూడు కోట్ల రూపాయల విలువైన ఒరిజినల్ డైమండ్ నగలనే ఉపయోగించారట. ఈ నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు. ఇక ఒరిజనల్ ముత్యాలు పొదిగిన చీరనే సమంత కట్టుకున్నారట. 30 కేజీలు బరువున్న ఈ చీర కట్టుకుని ఆమె ఏడురోజులు షూటింగ్‌లో పాల్గొన్నారని సమాచారం. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.