Jun 24,2022 11:23

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : గత 3 సంవత్సరాల వైసిపి పాలనలో జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిందని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు చెప్పారు. శుక్రవారం పాలకొల్లులోని 26 వ వార్డులో ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఎల్‌ఎ పర్యటిస్తూ ... ప్రజలతో మాట్లాడారు. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపాయని ' బాదుడే బాదుడు ' అంటూ ప్రజల కొనుగోలు శక్తి ని తగ్గించాయని విమర్శించారు. రాష్ట్రం, జిల్లా, పాలకొల్లులో పాలన కుంటుపడిందని అన్నారు. ఈ పర్యటన లో టిడిపి నేతలు కర్నేన రోజారమణి, పెచ్చెట్టి బాబు, జివి కోడివిజయ భాస్కర్‌, గౌరు నాయుడు, మామిడి శెట్టి పెద్దిరాజు, కడలి గోపి, తదితరులు పాల్గొన్నారు.