Reel’s – రీల్స్‌ పిచ్చితో వీడియో – యువకుడిపై కేసు నమోదు …!

తెలంగాణ : సోషల్‌ మీడియాలో రీల్స్‌ పిచ్చితో చేసే ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కొన్నిసార్లు ఆ రీల్స్‌ పిచ్చితో కొందరు మరణిస్తుంటే, మరికొందరు వారితోపాటు వారితో ఉన్నవారిని కూడా రిస్క్‌లో పడేస్తుంటారు.. ఇంకొందరు జనాల ప్రాణాల మీదికి తెస్తారు..! రీల్స్‌ మోజులో …. ఓ యువకుడు హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన డబ్బులు పడేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ లో వీడియోలు పెట్టాడు. బాలనగర్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ భానుచందర్‌ మనీ హంటింగ్‌ పేరుతో ఛాలెంజ్‌ చేస్తూ … రీల్‌ చేశాడు. ” ఇదిగో డబ్బు ఇక్కడ పడేస్తున్నా… ఎవరికి కావాలో వచ్చి తీసుకోండి… ఆల్‌ ది బెస్ట్‌ ” అంటూ వీడియో పెట్టాడు. ఆ వీడియో చూసిన ఘట్కేసర్‌ పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం ప్రజలు ఓఆర్‌ఆర్‌ పైకి భారీగా వచ్చే అవకాశం ఉందని, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. యువకుడిపై కేసు నమోదు చేశామన్నారు.

https://www.instagram.com/reel/DDtDsIqoQ0A/?utm_source=ig_web_copy_link

➡️