Fish – ఐదడుగుల కొరమీను – అన్నదాత చేతికి చిక్కేను..!

Dec 24,2024 10:15 #caught, #Farmer, #five-foot fish

జోగులాంబ (గద్వాల్‌) : ఓ అన్నదాత చేతికి ఐదడుగుల కొరమీను చేప చిక్కింది.. అంతే ఆ రైతు ఆనందం మిన్నంటింది..! జోగులాంబ గద్వాల్‌ జిల్లా అయిజ మండలం భూంపూర్‌ గ్రామంలోని నెట్టెంపాడు కాల్వలో సోమవారం రైతు హనుమంతుకు 5 అడుగులకు పైగా ఉన్న కొరమీను చేప దొరికింది. ఆ చేప 10 కిలోలకు పైగా బరువు ఉందని, కాల్వలో కనిపించగా ఎలాంటి వల లేకుండా చేతులతో అవలీలగా పట్టుకున్నానని రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రుచిలో, ప్రొటీన్‌ పోషకాలలో కొరమీను చేప గురించి చెప్పనక్కరలేదు.. అంత టేస్ట్‌ మరి…!

➡️