41 నిమిషాల్లో 21 పాటలు పాడి రికార్డు సృష్టించిన తొమ్మిదేళ్ల చిన్నారి

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఓ తొమ్మిదేళ్ల చిన్నారి 41 నిమిషాల్లో 21 పాటలు పాడి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో’ స్థానం సంపాదించింది. ఆ చిన్నారి పేరు కృతి శిఖా. అస్సాంలోని అభయపురి గ్రామానికి చెందింది. ఈమె తల్లిదండ్రులిద్దరూ గాయకులు కావడంతో.. కృతి కూడా చిన్న వయసు నుంచే పాటలు పాడడం నేర్చుకుంది. పాటలతో పాటు.. కృతికి భాష మీద పట్టు కూడా ఉంది. అందుకే ఈ చిన్నారి 41 నిమిషాల 34 సెకన్లలో 21 పాటలు పాడి రాకార్డు సృష్టించింది. కృతి పాడిన పాటల్లో అస్సామీతోపాటు హిందీ సాంగ్స్‌ కూడా ఉన్నాయి. ఈ చిన్నారి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించడం ఇది రెండోసారి. దీంతో ఆ ఊరి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

➡️