ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలుతో సెల్ఫీ తీస్తుండగా యువతి మృతి – వీడియో వైరల్‌..!

మెక్సికో : సెల్ఫీ మోజుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్న వార్తలు తరచూ వింటూనే, చూస్తూనే ఉంటాం. తాజాగా మెక్సికోలో ఓ యువతి రైలుతో సెల్ఫీ దిగే ప్రయత్నంలో మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూడటానికి నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు. రైలు సమీపించే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహంతో సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో రైలు పట్టాలకు బాగా దగ్గరగా వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టడంతో తలభాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియో చూసిన ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చేందుకు ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలవాలో అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..!

➡️