నేడు భూమికి చేరువగా రానున్న ఆస్టరాయిడ్‌

Jun 8,2024 13:36 #Asteroid, #earth, #NASA

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌ :    90 అడుగుల వెడల్పు కలిగిన ఓ ఆస్టరాయిడ్‌ (గ్రహశకలం) శనివారం భూమికి అతిచేరువగా రానుంది. గంటకు 29,961 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న 2024  KA1  పేరు కలిగిన అస్టరాయిడ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 16.36 గంటలకు భూమికి 18 లక్షల కి.మీ దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా తెలిపింది.

ఈ దూరం గణనీయంగా కనిపించనప్పటికీ.. ఖగోళపరంగా ఈ దూరం భూమికి చేరువగా వచ్చినట్లేనని నాసాకి చెందిన భూమికి సమీపంలో ఉన్న వస్తువుల అధ్యయన కేంద్రం (CNEOS) తెలిపింది. అపోలో వర్గానికి చెందిన ఈ ఆస్టరాయిడ్‌ భారీ పరిమాణంలో ఉన్నప్పటికీ.. భూమికి ఎటువంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది.

రానున్న రోజుల్లో మరికొన్ని ఆస్టరాయిడ్లు భూమికి సమీపంగా వెళ్లనున్నట్లు నాసా పేర్కొంది. 2024 KA1 తర్వాత సుమారు 84 అడుగుల పరిమాణం కలిగిన 2024 LC  భూమికి సుమారు 4,703,168 కి.మీ దూరంలో ప్రయాణించ జూన్‌ 11న మరో రెండు ఆస్టరాయిడ్లు భూమికి చేరువగా రానున్నట్లు తెలిపింది.

➡️