ఇంటర్నెట్ : బిజినెస్ స్కూల్‌లో చదువుకుంటున్న ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లారు.. అయితే వారిలో ఓ సీఐ ఫ్రెండ్ ఎవరెవరు ఎంత తిన్నారో… ఏమేం తిన్నారో లెక్కలేసి మరీ.. బిల్లును ఠక్కున షేర్ చేశాడు. వారెవ్వా ఫ్రెండ్ నీ ‘ఎక్సెల్ ఫుడ్ షీట్ ‘ భలే అదిరింది..! అంటూ … స్నేహా అనే ఓ యూజర్ ఆ ఫుడ్ షీట్ ఫొటోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ షీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ” బిజినెస్ స్కూల్‌లో చదువుకుంటున్న మా స్నేహితులు ఔటింగ్‌కు వెళ్లారు. ఆ గ్రూప్‌లో ఓ సీఏ ఉన్నాడు. వాళ్లకు అయిన మొత్తం బిల్లు ను అతడు ఎలా పంచాడో చూడండి ” అంటూ ఆమె రాసుకొచ్చారు. ఆ షీట్ ప్రకారం.. ఆరుగురు స్నేహితులు అలార్క్, శివంగి, ఇషాన్, యూసఫ్, మురళి, ప్రాంజల్ ఔటింగ్‌కు వెళ్లారు. ఇందులో ఫుడ్‌కు అయిన మొత్తం బిల్లును మొదట అలార్క్ చెల్లించాడు. టిప్పును ఇషాన్ అనే వ్యక్తి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ బఅందంలోని సీఏ ఫ్రెండ్ మొత్తం బిల్లుకు లెక్క లేశాడు. ఎవరెవరు ఏయే పదార్థాలు తిన్నారో.. వాటి ధర ఎంతో రాశాడు. దాని ప్రకారం ఎవరెవరు ఎంత చెల్లించాలో టేబుల్ తయారుచేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఎక్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సీఏ ఆలోచనా విధానాన్ని సమర్థిస్తుంటే, మరికొంతమంది మాత్రం దీనికి కూడా ఇంత ఆలోచించాలా ? అని పెదవి విరుస్తున్నారు. ఇంకొందరైతే అందులో తప్పులు కూడా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. మరి ఇలాంటి ఫ్రెండ్ మన గ్రూప్‌లో ఉంటే ..!
