Experiment – ఆడదోమలను మగదోమలతో చంపిస్తే – సరికొత్త ప్రయోగం..!

ఆస్ట్రేలియా : దోమకాటు వల్ల వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు. ముఖ్యంగా వ్యాధులు సోకడానికి ప్రధాన కారణమైన ఆడ దోమలకు చెక్‌ పెట్టేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వల్ల డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. వాటి కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు. మనుషులను కుట్టే ఆడ దోమలతో సంభోగం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని… ఇలా చేయడం వల్ల పురుగుమందుల్లా ఇతర ప్రయోజనకర జాతులకు నష్టం జరగకుండానే దోమల బెడదను నివారించొచ్చని వెల్లడించారు. దీనికి సంబంధించి ఈగల్లో జరిపిన ప్రయోగంలో.. ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించామన్నారు. అయితే దీనివల్ల మనుషులు, ఇతర జాతులకు ఎలాంటి హానిలేదని నిర్థారించుకున్న తరువాతే ఆ ప్రయోగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

➡️