ప్రజాశక్తి – పెద్దాపురం (కాకినాడ) : పెద్దాపురం పట్టణానికి చెందిన బంగారు ఆభరణాల కళాకారుడు, సూక్ష్మ కళాఖండాల శిల్పి, సూక్ష్మకళా ఖండాల రూపకల్పనలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తాళాబత్తుల సాయి చేతిలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ‘ ఊయల ‘ సూక్ష్మ కళాఖండం రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … రోజ్ వుడ్, బంగారంతో ఈ ఉయ్యాల మండపం సూక్ష్మ కళాఖండం రూపొందించినట్లు తెలిపారు. గాలికి ఊగే ఈ ఊయల మండపాన్ని తయారు చేయడానికి రోజుకు ఒక గంట చొప్పున 5 రోజులు సమయం పట్టిందన్నారు.