Video – సూట్‌ కేసులో గర్ల్‌ ఫ్రెండ్‌ – ప్లాన్‌ ప్లాప్‌…!

Apr 12,2025 13:05 #girlfriend, #in suit case, #plan flop

హర్యానా : గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌ కేసులో పెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లాలని ఓ విద్యార్థి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.. ఇంకేముంది ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది..! హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న జిందాల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థి పెద్ద సూట్‌ కేస్‌తో హస్టల్‌లోకి వచ్చాడు. అందులో ఏమున్నాయని సిబ్బంది అడగగా దుస్తులు, వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అతడి తీరుపై అనుమానం వచ్చిన హాస్టల్‌ గార్డులు ఓసారి సూట్‌ కేస్‌ తెరవాలని కోరారు. అందుకు ఆ విద్యార్థి నిరాకరించాడు. దీంతో వారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. సూట్‌ కేస్‌ను తెరిచి చూడగా, అందులో నుంచి ఓ అమ్మాయి బయటకు రావడంతో అంతా అవాక్కయ్యారు..! ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ విద్యార్థి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే సూట్‌ కేసులో ఉన్న అమ్మాయి అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థా ? లేక బయటనుంచి వచ్చిన వ్యక్తా ? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారుతీ సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చూసిన ఓ వ్యక్తి స్పందిస్తూ..”ఈ మధ్య సూట్‌ కేసులు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నట్టున్నాయి” అంటూ చమత్కరించారు.

➡️