ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఎక్కడైనా మేక ఒక ఈతలో ఒకటి, రెండు లేదా మూడు పిల్లలను కనడం సహజం. కానీ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలంలో ఉన్న గుర్రంవారి కండ్రిగ గ్రామంలో ఓ మేక ఒకే ఈతలో ఏకంగా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ గ్రామంలోని రామకృష్ణా రెడ్డి అనే రైతు పెంచుకుంటున్న మేక ఒకే ఈతలో ఐదు పిల్లలను కనడంతో అంతా ఆశ్చర్యపోయారు. రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు.