చిన్నప్పటి నయనతారని చూశారా?

Apr 4,2024 12:10 #nayanatara

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరోయిన్‌ నయనతార చిన్నప్పటి ఫొటోని చూశారా? ఇటీవల నయనతార తన తండ్రి చిన్నప్పుడు తనని ఎకత్తుకున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా నయన్‌ ఈ స్పెషల్‌ ఫొటోని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మై ఫరెవర్‌ లవ్‌, ఐ లవ్యూ అచ్చా (నాన్న) అని నయన్‌ ఈ ఫొటోకి క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఇక తన కుమారులు ఉయిర్‌, ఉలక తమ తాత కోసం మూడు బర్త్‌డే పార్టీ కేకులతో వచ్చారని నయన్‌ భర్త విఘ్నేష్‌ శివన్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో నయన్‌ పిల్లలిద్దరూ బర్త్‌డే కేక్‌ని వేళ్లతో పొడుస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

➡️