గోవాలో ఘనంగా జరిగిన హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ వివాహం

Feb 22,2024 12:18 #Rakul Preet Singh

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వివాహం బుధవారం ఘనంగా జరిగింది. రకుల్‌ తాను ప్రేమించిన జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. వీరి వివాహ వేడుక ఐటిసి గ్రాండ్‌ సౌత్‌ గోవా హోటల్‌లో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లి ఫొటోలను భగ్నానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నూతన జంటకు ప్రముఖ నటి సమంతతోపాటు పలువురు సెలబ్రిటీలు శుభాకాక్షంలు తెలిపారు.

రకుల్‌ బాలీవుడ్‌లో ఒకే ఏడాది ఐదు చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘ఎటాక్‌’, ‘రన్‌వే 34’, ‘కట్‌పుట్లీ,’ ‘డాక్టర్‌ జీ’, ‘థాంక్‌ గాడ్‌’ చిత్రాలు విడుదలయ్యాయి. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో విజయాన్ని అందుకుంది.

➡️