క్యాన్సర్‌కు దివ్యౌషధం – లక్ష్మణ ఫలం..!

May 3,2024 14:51 #Cancer, #cure, #Lakshmana fruit

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : సీతాఫలం తెలుసు,…. రామా ఫలం గురించి విన్నాం…. లక్ష్మణ ఫలం ఏమిటి ? అంటూ ఆశ్చర్యపోతున్నారా ? అయితే రండి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట పంచాయతీ పరిధి చెమ్మచెరువు గ్రామంలో కౌలు రైతు బొక్క సత్యనారాయణ ఇంటి ఆవరణలో ఉన్న లక్ష్మన్న చెట్టుకు లక్ష్మణ ఫలాలు కాశాయి. సీత, రామ, హనుమాన్‌ ఫలాలతో పాటు లక్ష్మణ ఫలం కూడా ఉండటం విశేషం.. అయితే సీతా, రామ, హనుమాన్‌, ఫలాలు ఒకే విధంగా ఉంటే లక్ష్మణ ఫలం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అత్యంత అరుదైన లక్ష్మణ ఫలం క్యాన్సర్‌ లోని పలు వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫలం తొక్కతో సహా గింజలు గుజ్జు ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉండడం విశేషం. ఈ సంవత్సరం తమ ఇంటి వద్ద రెండు చెట్లు ఉన్నాయని ఈ చెట్టుకు 5 లక్ష్మణ ఫలాలు కాశాయని క్యాన్సర్‌ రోగులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెమ్మచెరువు గ్రామానికి చెందిన కౌలు రైతు బొక్క సత్యనారాయణ తెలిపారు. ఇది చూడటానికి ఉమ్మెత్త కాయ మాదిరిగ ముళ్ళతో నిండి ఉండటం ఈ ఫలం ప్రత్యేకత.

➡️