ఇంటర్నెట్‌డెస్క్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపట్ల ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో సహా పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాలు గానీ, రాజకీయ నేతలతో ఆయనకున్న సంబంధాలు, ఆయన వ్యక్తిత్వం, ఇష్టమైన వంటకాలు వంటి విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మన్మోమన్ సింగ్ శాఖాహారి. ఆయన పాపడాలు (అప్పడాలు)తో పెరుగున్నం తినడమంటే చాలా ఇష్టమట. ఆయన భోజనం సాదాసీదాగానే ఉండేది. పచ్చళ్లు, పండ్లలో దానిమ్మ. వీటితోపాటుగా పెరుగుతో చేసే ఖాదీ చావల్ అనే వంటకాన్ని ఇష్టంగా తినేవారట. అయితే పూర్తి వెజ్‌టేరియన్ అయిన మన్మోహన్ ఒకసారి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు తన డైట్‌ని బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు మీడియాకు తెలిపారు. ‘బంగ్లాదేశ్‌లో హిల్సా ఫిష్‌తో ఫిష్‌తో చేసే వంటకం చాలా రుచిగా ఉంటుందని నేను విన్నాను. వెజిటేరియన్ ఫుడ్‌ని బ్రేక్ చేసి.. ఈ వంటకాన్ని రుచిచూడాలనుకుంటున్నాను’ అని 2011లో ఆయన మీడియాకు తెలిపారు.
ప్రధానిగా పి.వి నరసింహారావు ఉన్న సమయంలో మన్మోహన్ ఆర్థికమంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ చరిత్రలో కీలకమలుపుగా మిగిలాయి.