నౌపడలో వికసించిన ‘మే పుష్పం’

May 16,2024 11:59 #srikakulam

ప్రజాశక్తి -నౌపడ : శ్రీకాకుళం జిల్లా నౌపడ సర్పంచ్ పిలకా బృందాదేవి, రవికుమార్ రెడ్డి ఇంటి ఆవరణలో గురువారం అరుదైన మే పుష్పం వికసించింది. ఇది ఏడాదిలో ఒక్కసారి మాత్రమే.. ఒక పుష్పం మాత్రమే వికసిస్తుంది. చూడ్డానికి ఆకర్షణగా ఉన్న ఈ పుష్పాన్ని చూసేందుకు గ్రామస్తులు వస్తున్నారు. ఇది ప్రతికూల వాతావరణంలోనూ, ఇసుక నేలలలో పెరిగి ఎండ వేడిమికి మే నెలలో మాత్రమే కనిపిస్తుంది. దీంతో దీనికి మే పుష్పం గా పిలుస్తుంటారు. అరుదైన ఈ పుష్పాన్ని సర్పంచ్ ఇంటి ఆవరణలో గత ఐదేళ్లుగా తమ పెరట్లో పెంచుకుంటున్నారు.

➡️