‘Miss AI’ భామల అందాల పోటీలు…!

‘Miss AI’ : మిస్‌ ఇండియా, మిస్‌ యూనివర్స్‌ విన్నాం.. చూశాం… మరి మిస్‌ ఎఐ …! సరికొత్త టెక్నాలజీ గమ్మత్తులు వింటుండటం.. చూస్తుండటం .. అవాక్కవ్వడం… మన వంతవుతోంది.  AI చూస్తుంటే అచ్చం మనిషిలాగే ఉంది. ఇటీవలే ఎఐ అందాల భామలను చూశాం.. విస్తుపోయాం కూడా..! అందమైన ఎఐ యాంకర్లు కూడా కనువిందు చేసి యాంకరింగ్‌ చేసి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం కృత్రిమ మేధ ప్రవేశించని రంగమే లేదు. ప్రపచంలోనే తొలిసారిగా ఎఐ అందాల భామల పోటీలకు వరల్డ్‌ ఏఐ క్రియేటర్‌ అవార్డ్స్‌ పిలుపునిచ్చింది.

20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ..!
మిస్‌ ఏఐ పోటీలో నెగ్గిన విజేతకు 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నారు. ఈ పోటీల కోసం ఏప్రిల్‌ 21 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మే 10న విజేతలను ప్రకటించనున్నారు.

AI Anchor
AI Anchor

నిర్ణేతల్లో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్లు..!
ఈ మొట్టమొదటి ‘Miss AI’ పోటీలో మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీ పడనున్నారు. ఈ భామల లుక్స్‌, వీటి క్రియేషన్స్‌ వెనక ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యాలు, సోషల్‌ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి వాటిని నిర్ణేతలు పరిగణనలోకి తీసుకోనున్నారు. నిర్ణేతల్లో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉండటం విశేషం.

AI Anchor
AI Anchor

విజేతలను ఎలా ప్రకటిస్తారంటే…
తొలిసారిగా కంప్యూటర్‌ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్‌ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్‌ A× క్రియేటర్‌ అవార్డ్స్‌ వర్చువల్‌ మోడల్స్‌ని సబ్‌స్క్రిప్షన్‌-ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ అయిన ఫ్యాన్‌వ్యూని కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్‌ మోడల్‌ ఫ్యాన్‌ వ్యూ, పీఆర్‌ మద్దతులను కూడా బేస్‌ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్‌, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్‌ ఏఐ క్రియేటర్‌ అవార్డ్స్‌ పేర్కొంది.

ఈ పోటీలు ఎందుకంటే ?
ఎఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీయడానికి జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్‌ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్‌ మోడల్స్‌నే క్రియేట్‌ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్‌ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్‌ క్రియేషన్స్‌ని స్వాగతిస్తుంది. అది డీప్‌ ఏఐ, లేదా వ్యకగత టూల్స్‌ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్‌ ప్రైజ్‌ గెలుచుకున్నవారు దాదాపు రూ.4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు.

నలుగురు సభ్యుల ప్యానెల్‌…
ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్‌ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్‌లో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లయోన్సర్‌ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్‌ఫాలోయింగ్‌ కలిగిన స్పెయిన్‌కు చెందిన ఐతానా లోపెజ్‌, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్‌ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్‌, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్‌ స్కాండల్స్‌ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్‌ ఫాసెట్‌ విజేతలను ప్రకటిస్తారు. మరి చూడాలి… ఈ ఎఐ అందాల భామల పోటీల్లో ఎవరు కిరీటాన్ని కైవసం చేసుకుంటారో…!

➡️