భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసి … ప్రియుడితో పరార్‌ ..!

పశ్చిమ బెంగాల్‌ : భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసి … ఆ డబ్బుతో ప్రియుడితో ఉడాయించిన కిలాడీ భార్య ఉదంతం పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగింది. హౌరా జిల్లాలోని సంక్రైల్‌లో ఓ మహిళ తన భర్తను కిడ్నీ అమ్మాలని బలవంతపెట్టింది. ఆ దంపతులకు 10 సంవత్సరాల కుమార్తె ఉంది. ” డబ్బు లేకపోవడం వల్ల మన కూతురి భవిష్యత్తును తీర్చిదిద్దలేకపోతే, అది మీదే తప్పు అవుతుంది. మీ కూతురి భవిష్యత్తును నాశనం చేయడానికి మీరే బాధ్యత వహించాలి ” అని నిరంతరం తన భర్తను ఎత్తిపొడుస్తూనే ఉంది. అతని ఆదాయం అతని కూతురి చదువు ఖర్చులకు సరిపోలేదు. కాబట్టి భార్య తన భర్తతో మీ కిడ్నీని అమ్మేయండి. దీంతో మన ఆర్థిక సమస్యలు అన్నీ తీరుతాయని నమ్మబలికింది. దీంతో తన కూతురి భవిష్యత్తు కోసం అతను తన కిడ్నీని అమ్మడానికి అంగీకరించాడు. అప్పటి నుండి అతను తన కిడ్నీ ఎవరైనా కొంటారేమోనని నెల రోజుల పాటు వెతికాడు. ఒక నెల తర్వాత అతని కిడ్నీ రూ.10 లక్షలకు అమ్ముడయ్యింది. భార్యాభర్తలిద్దరూ కలిసి కిడ్నీ కొంటున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి డబ్బు తెచ్చారు. దీని తరువాత భార్య ఈ డబ్బు నాకు ఇవ్వు అని చెప్పింది. ఉదయంకాగానే నేను ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తాను అంది. దీంతో తన భార్యే కదా అని భర్త అంగీకరించాడు. అతను ఆ డబ్బును తన భార్యకు ఇచ్చాడు. కానీ భార్య ఆ డబ్బులు తీసుకుని రాత్రే ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తరువాత గత శుక్రవారం తన భార్య బరాక్‌పూర్‌లోని సుభాష్‌ కాలనీలో పెయింటర్‌గా పనిచేస్తున్న రవిదాస్‌ అనే వ్యక్తితో నివసిస్తున్నట్లు భర్తకు తెలియగానే అతను తన కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు ఆమె ఇంట్లోనే ఉండి తలుపు గడియపెట్టుకుంది. ” ఏం చేసుకుంటావో చేసుకో నీకు విడాకులు పంపిస్తాను ” అని గట్టిగా అరిచేసింది. కనీసం తన పదేళ్ల కూతురు మీద కూడా జాలి చూపించలేకపోయింది. చేసేదిలేక ఆ పెయింటర్‌ రవిదాస్‌, భార్య ఇద్దరిపై భర్త కేసు పెట్టాడు. ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️