తన అభిమానిని సర్‌ప్రైజ్‌ చేసిన సచిన్‌ టెండూల్కర్‌

Feb 3,2024 08:27 #Cricket, #Sachin Tendulkar

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన అభిమానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన అభిమానిని కలిసి ఆటోగ్రాఫ్‌ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను టెండూల్కర్‌ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సచిన్‌ కారులో వెళుతుంటే.. తన కారు ముందు బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి ముంబయి ఇండియన్‌ జెర్సీని ధరించాడు. ఈ జెర్సీని ధరిస్తే స్పెషల్‌ ఏముంది. ఆ జెర్సీపై ‘టెండూల్కర్‌ ఐ మిస్‌ యు’ అని రాసి ఉంది. దీంతో సచిన్‌ వెంటనే తన కారును ఆపి తన అభిమానిని పలకరించాడు. తన ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. ఆ అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఈ వీడియోను సచిన్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. తన హృదయం ఆనందంతో నిండిపోయిందని ఈ సందర్భంగా పోస్టులో రాసుకొచ్చాడు. జీవితంలో ఇలాంటి అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయని సచిన్‌ పోస్టులో రాసుకొచ్చారు.

➡️