ఇంటర్నెట్‌డెస్క్ : కాంగ్రెస్ ఎంపి శశిథరూర్‌కి గార్డెన్‌లో అనుకోని అతిథి ప్రత్యక్షమైంది. ఆయన దగ్గరకు వానరం చేరి.. ఎంచక్కా ఒడిలో కూర్చుని కునుకుతీసింది. శశిథరూర్ ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఎక్సట్రార్డినరీ అనుభవం అని ఆయన పోస్టులో రొసుకొచ్చారు. తనకెదురైన ఈ అనుభవం గురించి శశిథరూర్ ‘ఈరోజు (బుధవారం) ఉదయం నాకొక ఎక్సట్రార్డినరీ అనుభవం కలిగింది. నేను గార్డెన్‌లో కూర్చొని వార్తా పత్రికల్ని చదువుతున్నాను. ఆ సమయంలో ఒక కోతి తిరుగుతూ నా దగ్గరకు వచ్చి నా ఒడిలో కూర్చుంది. మేము దానికి తినడానికి రెండు అరటిపండ్లను ఇచ్చాము. వాటిని తిని నా ఛాతిపై నన్ను కౌగిలించుకుని నిద్రపోయింది. తర్వాత నేను మెల్లగా లేవబోయాను.. ఆ సమయంలో అది నా నుంచి కిందకు దూకి వెళ్లిపోయింది’ అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు. దీంతోపాటు ఆయన ఒడిలో వానరం కూర్చున్న నాలుగు ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.