ఆలయ ప్రసాదంలో పాము పిల్ల

May 7,2025 11:58 #Baby snake, #temple offering

హోసూరు : ఆలయ ప్రసాదంలో పాము పిల్ల రావడంతో యాత్రికుల్లో కలవరం రేగింది. హోసూరు కార్పొరేషన్‌ పరిధిలో కొండమీద ఉన్న ప్రసిద్ధ మరగతాంబ సమేత శ్రీ చంద్రచూడేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దేవదాయశాఖ ప్రసాదాల దుకాణం ఉంది. మంగళవారం ఓ యాత్రికుడు పులిహోర ప్రసాదం డబ్బా కొని తెరిచి చూడగానే … అందులో చచ్చిన పాము పిల్ల కనిపించడంతో షాకయ్యాడు. దీంతో యాత్రికులందరిలో కలవరం రేగింది. అంతా కలిసి దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వంట సిబ్బంది వండేటప్పుడు పాము పిల్ల పడి ఉంటుందని భావిస్తున్నారు.

➡️