సీక్రెట్‌గా వివాహం చేసుకున్న హీరోయిన్‌ తాప్సీ

Mar 25,2024 15:41 #heroine, #Taapsee Pannu

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరోయిన్‌ తాప్సీ పన్ను సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియస్‌ బోను, హీరోయిన్‌ తాప్సీ దాదాపు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ కాస్తా వివాహానికి దారితీసింది. మార్చి 23వ తేదీన వీరిరువురూ ఉదరుపూర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నారని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులు, కొద్దిమంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

కాగా, ప్రముఖ బాలీవుడ్‌ యాక్టర్‌ పావెల్‌ గులాటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాప్సీ పెళ్లి ఫొటోలను షేర్‌ చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు తాప్సీ, మథియస్‌ల జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాప్పీ తెలుగులో ‘ఝుమ్మందినాదం’ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హిట్‌కొట్టిన తాప్సీ తెలుగులో వరుస సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించడం మొదలుపెట్టింది. హీరోయిన్‌ ఓరియెంట్‌ మూవీల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

➡️