కొండల మధ్యలో డిన్నర్‌.. ఫొటోలు వైరల్‌

Mar 20,2024 12:54 #trending twitter

ఇంటర్నెట్‌డెస్క్‌ : నేటికాలంలో కొత్తగా పెళ్లైన జంటలు డిఫరెంట్‌గా ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం ఫొటోలే కాదండోరు.. ట్రెండ్‌ని సెట్‌ చేసే విధంగా డిఫరెంట్‌గా వీడియోలను కూడా రూపొందిస్తున్నారు. తాజాగా ఓ నూతన జంట కూడా విభిన్నంగా ఆలోచించింది. రెండు కొండల మధ్యలో.. కేబుల్‌ వైర్లపై టేబుల్‌ని ఏర్పాటు చేసుకుని.. ఎదురెదురు కుర్చీలపై కూర్చొని.. స్వచ్ఛమైన పచ్చని వాతావరణంలో ఈ నూతన దంపతులు డిన్నర్‌ చేశారు. ఈ జంట ఎక్కడ డిన్నర్‌ చేశారు? ఎప్పుడు చేశారు అనే వివరాలు లేవు. దీనికి సంబంధించిన ఫొటోల్లో మాత్రం.. వధువు వైట్‌ గౌన్‌, వరుడు కోటు ధరించి కనిపించారు. ‘గాలి’లో భోజనం చేయాలనే ఈ జంట వినూతన్న ఆలోచనకు దగ్గరున్న వారు కూడా వారికెంతో సహాయపడ్డారు. వధూవరులిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వారిని చాలా జాగ్రత్తగా కిందపడిపోకుండా.. కొండల మధ్యలో విందు చేసేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేలా ఫొటోలు వీడియోలు కూడా తీశారు. ప్రస్తుతం సోసల్‌మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన వారెవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.

➡️