సమయస్ఫూర్తితో వ్యవహరించి యువకుడి ప్రాణాలు కాపాడిన కండక్టర్‌

తిరువనంతపురం : కండక్టర్‌ సమయస్ఫూర్తి వల్ల ఓ యువకుని ప్రాణం నిలబడింది. ఇంతకీ ఆ కండక్టర్‌ ఎలా యువకుడి ప్రాణాలను కాపాడాడో తెలుసుకోవాలనుందా? ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కేరళలో ఓ యువకుడు బస్సు ఎక్కాడు. ఆ బస్సు కండక్టర్‌ ప్రయాణీకులకు టికెట్‌ ఇస్తున్నాడు. ఈలోపే ఆ యువకుడు బస్సులో నుంచి పడిపోబోతుండగా.. ఆ కండక్టర్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక చేత్తో.. ఆ యువకుడిని గట్టిగా పట్టుకుని బస్సులోకి లాగాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కండక్టర్‌ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. కండక్టర్‌ లేకపోతే ఆ యువకుడి పరిస్థితి ఏంటి? అతని ప్రాణాలను కాపాడిన మహానుభావుడివయ్యా నువ్వు అని కండక్టర్‌ని అభినందిస్తున్నారు.

 

➡️