కన్నతల్లిని పరుగెత్తించి కొట్టిన కొడుకు – చోద్యం చూసిన జనం..!

Apr 3,2024 11:59 #beat, #mother, #Son, #Viral Video

ఉత్తరప్రదేశ్‌ : ఓ యువకుడు తన కన్నతల్లిని వెంబడించి పరుగెత్తించిమరీ కొట్టిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్‌ లో జరిగింది. ఓ గుడి ఆవరణలో తల్లి సాయం చేయండి అంటూ అరుస్తూ కొడుకుకు చిక్కకుండా పరుగులెడుతోంది. ఆమెను కొడుకు నెమ్మదిగా వెంబడిస్తూ కొడుతున్నాడు. అక్కడ ఉన్న జనమంతా చోద్యం చూస్తున్నారే తప్ప ఆమెకు సాయపడేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ తల్లి కొడుకు కొడతాడన్న భయంతో పరుగెడుతుంటే యువకుడు బలమైన కట్టెతో ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దారుణాన్ని ఓ స్థానికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఘటన వెలుగుచూసింది. దీంతో ఈ వీడియో వైరల్‌ గా మారింది. ఎట్టకేలకు స్పందించిన జనం.. ఆ యువకుడిని పట్టుకుని తల్లిని కాపాడారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు యువకుడిని అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

➡️