ఓ పేషెంట్‌ కడుపులో 39 నాణాలు, 37 అయస్కాంతాలు.. అతనెందుకు మింగాడంటే..?!

Feb 27,2024 18:06 #Delhi, #operation, #trending twitter

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన సర్జరీ చేశారు. రోగి కడుపులోని పదుల సంఖ్యలో నాణాలను బయటకు తీసి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తీవ్రమైన వాంతులు కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స కోసం సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు సిటీ స్కాన్‌ చేయగా.. అతని కడుపులో నాణాలు, అయస్కాంతాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. చిన్న పేగులో రెండు చోట్ల మ్యాగెట్లు, నాణాలు నిలిచిపోయాయి. సర్జరీలో పేగును కోసి ఆ నాణాలను, మ్యాగెట్లను వైద్యులు బయటకు తీశారు. వాటిల్లో రూ.1, రూ.2, రూ.5కు చెందిన 39 నాణాలు, రకరకాల ఆకారంలో ఉన్న 37 మ్యాగెట్లను వైద్యులు అతని కడుపు నుంచి తీశారు. సర్జరీ తర్వాత ఏడు రోజులకు అతన్ని డిస్‌చార్జ్‌ చేశారు. శరీర ధారుఢ్యం కోసం జింక్‌ అవసరమని, అందుకే మ్యాగెట్లను మింగినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. నాణాల్లో జింక్‌ మూలకం ఉంటుందని, అయితే అది కడుపులో ఎక్కువ సేపు ఉండాలంటే మ్యాగెట్‌ అవసరమని ఆ వ్యక్తి రెంటిండిని తీసుకున్నాడు. ఆ రోగి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, అందుకే పదుల సంఖ్యలో నాణాలను మింగాడని వైద్యులు తెలిపారు.

➡️