‘2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో : ఆనంద్‌ మహీంద్ర

అమరావతి : ‘2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో… అంటూ … కార్పొరేట్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గ్రేట్‌ నికోబార్‌ ద్వీపంలోని దట్టమైన అడవుల్లో నివసించే షోంపెన్‌ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు ఈ 2024లో మొదటిసారి ఓటేశారు. ఓటు గుర్తున్న వేలును కూడా చూపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మహీంద్రా షేర్‌ చేస్తూ.. ‘2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో. గ్రేట్‌ నికోబార్‌లోని షోంపెన్‌ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎదురులేని, తిరుగులేని శక్తి’ అంటూ ట్వీట్‌లో రాశారు. ప్రస్తుతం మహీంద్రా షేర్‌ చేసిన ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో చూసినవారంతా ‘పిక్చర్‌ ఆఫ్‌ ది డే’ అంటూ కామెంట్స్‌ చేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

➡️