మరోసారి తల్లిదండ్రులైన విరాట్‌ కోహ్లి దంపతులు

Feb 21,2024 10:49 #Virat Kohli

ముంబయి: టీం ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. అనుష్క, తాను మరోసారి తల్లిదండ్రులమయ్యామని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నెల 15న ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండో సంతానానికి ‘అకారు’ అనే పేరు పెట్టామని తెలిపాడు. తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని నెటిజన్లు, ఫ్యాన్స్‌ని కోహ్లీ కోరాడు. ఈ జంట 2021 జనవరి 11న తొలి సంతానంలో వామిక అనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కుమారుడు జన్మించడంతో వామికకు సోదరుడు వచ్చాడని సంతోషంతో మురిసిపోతూ.. కోహ్లీ తన సంతోషాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.

➡️