డిజిటల్‌ బెగ్గర్‌ : వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ : దేశంలో బిక్షగాళ్లు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూస్తే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే. అస్సాం రాజధాని గౌహతిలో దశరథ్‌ అనే ఓ బిక్షగాడు ఫోన్‌ పే కార్డును మెడలో వేసుకుని కారు వద్దకు వెళ్లి డబ్బులు అడిగితే వారు తన మెడలో ఉన్న ఫోన్‌ పే క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసుకుని తన ఎకౌంట్‌కి పది రూపాయలు డిజిటల్‌ పేమెంట్స్‌ చేశారు. తాజాగా ఈ వీడియోను కాంగ్రెస్‌ నాయకుడు గౌరవ్‌ సోమాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోకు జతగా.. ‘టెక్నాలజీకి హద్దులు లేవు. సామాజిక, ఆర్థిక స్థితిగతలలో కూడా అడ్డంకులను అధిగమించగల సాంకేతిక శక్తికి ఇది నిదర్శనం. మానవత్వానికి, డిజిటల్‌ పురోగతికి మధ్య జరిగిన ఈ ఘటనపై ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క ఘటన ఆలోచనను రేకెత్తిస్తుంది.’ అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు. కాగా, గతంలో బీహార్‌లో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. బీహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్‌లో ఓ బిక్షగాడు కూడా ఇలానే మెడలో ఫోన్‌ పే క్యూఆర్‌ కోడ్‌ని వేసుకుని సాయం చేయమని కోరాడు. తాజాగా గౌహతిలోకూడా ఇలానే జరగడం గమనార్హం.

➡️