అమరావతి : ఇన్‌స్టాగ్రాం వేదికగా ఓ అభిమాని హీరోయిన్ సమంతకు ప్రపోజల్ చేశారు. వెంటనే సమంత కూడా అతడి ప్రపోజల్ కు ఆల్ మోస్ట్ కన్వెన్స్ అయినట్లు తెలిపారు. సమంత మాజీ భర్త హీరో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు నటి శోభిత ధూళిపాళ్లను అతడు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే సమంతకు ఓ అభిమాని ప్రపోజల్ చేయగా.. ఆ అభిమానికి ఫన్నీగా ఓకే చెప్పింది సామ్.
సమంత మీద తనకున్న ప్రేమను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ఒక వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోలో.. ” సామ్ నువ్వు బాధ పడాల్సిన అవసరం అస్సలు లేదు. నీకోసం నేను ఎప్పుడూ ఉంటాను. నువ్వు నేను కలిస్తే ఒక మంచి జంట అవుతుంది. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నాకోక 2 ఇయర్స్ టైం ఇవ్వు డబ్బులు సంపాదింది నీ దగ్గరికి వస్తాను. అప్పటివరకు నా గుర్తుగా ఈ పువ్వు అదే హార్ట్‌ను ఉంచుకో. ప్లీజ్ మ్యారీ మీ, ప్లీజ్ మ్యారీ మీ సామ్ ” అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన సమంత.. బ్యాక్‌గ్రౌండ్‌లో జిమ్ కనిపిస్తుంది. ” నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను ” అంటూ అభిమానికి సమంత సమాధానమిచ్చారు. సమంత రిప్లై ఇవ్వడంతో ముఖేష్ సంబరపడిపోయాడు. ‘ప్రపంచం సమంతకు వ్యతిరేకంగా ఉంటే.. నేను ప్రపంచానికి వ్యతిరేకిని’ అని అతను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.