అమెరికా : కొన్నిసార్లు సముద్రపు వేటలో… ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి.. కొన్ని విషాదంగా మారితే, మరికొన్ని చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఉంటాయి. మరి సముద్రంతో ఆట .. భారీ తిమింగలాల మధ్య వేట ..! అలా ఉంటది..! ఈ తరహాలోనే …. గత మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటుపై భారీ తిమింగలం దాడి చేసిన ఘటన అమెరికాలోని న్యూహాంప్‌షైర్ లో జరిగింది. అమెరికాలోని న్యూహాంప్‌షైర్ ప్రొట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో 23 అడుగుల పొడవు ఉండే బోటుతో కొందరు వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. ఆ బోటు సమీపంగా ఓ భారీ తిమింగలం వచ్చింది. మరో బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దానిని వీడియో తీస్తుండగా ఊహించని ఘటన జరిగింది. అమాంతం భారీ తిమింగలం సముద్రంలో నుండి గాల్లోకి లేచి బోటుపై పడింది. అంతే దాని దెబ్బకు బోటు తిరగబడింది. దీనిని ముందే ఊహించిన ఓ వ్యక్తి సముద్రంలోకి దూకేయగా, మరొకరు తిమింగలం దాడితో నీటిలో పడిపోయాడు. వెంటనే సమీపంలోని వ్యక్తులు కొందరు వారిని రక్షించారు. బతుకు జీవుడా.. అంటూ ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.. మీరూ చూసేయండి మరి..!
Whale lands on boat 😮😱 pic.twitter.com/eIJPIsB8YO
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 24, 2024