chia seeds : వేసవి తాపాన్ని తగ్గించే చియా సీడ్స్‌

Mar 19,2024 12:01 #chia seeds, #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : నలుపు, తెలుపు రంగుల్లో మార్కెట్లో లభించే చియా సీడ్స్‌ వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడేవారు చియా సీడ్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారని పలు పరిశోధనలు వెల్లడించాయి.

– చియా సీడ్స్‌ని నేరుగా తీసుకోకూడదు. వాటిని నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టిన వాటిని పెరుగులోనూ, సలాడ్స్‌లోనూ వేసుకుని తీసుకోవచ్చు.

– నానబెట్టిన వాటిని ఒక గ్లాసు నీటిలో వేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేదా పంచదార, గ్యాస్‌ వాటర్‌ని పోసుకుని తీసుకోవచ్చు.

– చియా సీడ్స్‌ వల్ల బరువు మాత్రమే కాదు. వేసవి తాపం నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.

– చియా సీడ్స్‌లో ప్రొటీన్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి జీర్ణక్రియకు ఎంతో దోహదపడతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడతాయి.

➡️