తెలంగాణ : ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమవుతున్న యువతులు.. హైటెక్ సిటీలోని ఓ పబ్‌కి యువకులను తీసుకెళ్లి గంటలో రూ.40 వేల బిల్లు చేసి కనిపించకుండా జారుకుంటున్నారు.. ఆ పబ్ వాళ్లు ఆ డబ్బంతా కట్టాలంటూ యువకులపై ఒత్తిడి తెస్తున్నారు…! ఇప్పటివరకూ 8మంది బాధితులు వెలుగులోకి వచ్చారు..!
టిండర్, బంబుల్ అనే డేటింగ్ స్కాం నగరంలో వెలుగుచూసింది. ఈ యాప్ ద్వారా పరిచయమవుతున్న యువతులు.. వెంటనే కలుద్దాం అంటూ.. వాట్సాప్ ద్వారా యువకులకు మెసేజ్ పెడుతున్నారు. ఆ యువకులను హైటెక్ సిటీలోని ఓ పబ్‌కి తీసుకెళుతున్నారు. ఆ పబ్‌లో ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి యువతులు కనిపించకుండా నెమ్మదిగా జారుకుంటున్నారు. గంటలో రూ.40 వేల బిల్లు చూసి యువకులు ఖంగుతింటున్నారు. ఆ డబ్బంతా కట్టాలంటూ పబ్ నిర్వాహకులు ఆ యువకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికి 8మంది బాధితులుగా మారినట్లు తెలుస్తుంది. అయితే పబ్ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ స్కాంకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాము కూడా బాధితులమేనంటూ పలువురు ముందుకు వస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.