Lockdown – దేశంలో లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు..!

అమరావతి : కరోనా నియంత్రణ కోసం భారతదేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్‌డౌన్‌ను క్రమంగా మూడుసార్లు పొడిగించారు. అత్యంత కఠినంగా అమలైన ఈ లాక్‌డౌన్‌ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రతరం చేసింది.  ఇండ్లలో నుండి ప్రజలెవ్వరూ బయటకు రాలేని దుస్థితి ఏర్పడింది. మనిషిని మనిషి చూస్తేనే భయపడిన చీకటి రోజులవి. మరణ మృదంగం మోగింది. మృతదేహాలను కూడా తీసుకెళ్లే దిక్కులేని పరిస్థితుల్లో … మత సామరస్యంతో కొందరు తెగించి సమాజ సేవకు పూనుకున్న ఆ రోజులను ఎవ్వరూ మరిచిపోలేరు. కరోనా ఓ వైపు … వర్షాలు ఓ వైపు … ఎక్కడ నుండి ఏ శవం లేస్తుందోనన్న భయంతో బతికిన ప్రజలో వైపు …!  అంత్యక్రియలు ఎలా జరిగాయో… ఏ శవాన్ని ఎలా పూడ్చారో కూడా తెలీని రోజులవి. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని భయంతో బతికిన రోజులవి. రక్షణ వ్యవస్థ, వైద్య వ్యవస్థ, సమాజ సేవకులు వీరోచిత తెగింపుతో సేవలందించిన రోజులవి. ఎంతమంది అనాథలైపోయారో… ఎన్ని కుటుంబాలు దిక్కులేనివైపోయాయో… నేటికీ ఆ కన్నీటి కరోనాను మరిచిపోలేని వారెందరో..!

➡️