ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు మోడీ ఫోన్‌ చేసి తిట్టారు : మిథున్‌ చక్రవర్తి

Feb 13,2024 12:18 #Mithun Chakraborty, #modi

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి ఇటీవల గుండెపోటుకి గురయ్యారు. కలకత్తాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆయన సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి మిథున్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి మోడీ నాకు ఫోన్‌ చేశారు. నేను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు ఆయన నన్ను తిట్టారు. ఇక నుంచి నా ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకోవాలి. యధావిధిగా రేపటి నుంచి సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవ్వాలి. ‘ అని ఆయన అన్నారు.

కాగా, మిథున్‌ చక్రవర్తి హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, తమిళ భాషల్లో కలిపి 350 సినిమాల్లో నటించారు. ‘డిస్కో డ్యాన్సర్‌’ మూవీతో మిథున్‌ బాగా పాపులర్‌ స్టార్‌ అయ్యాడు. ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది.

➡️