ఇంటర్నెట్‌డెస్క్ : నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాము విడాకులు తీసుకున్నట్టు గతేడాది జులైలో నిహారిక- చైతన్య జంట ప్రకటించి మెగా ఫ్యాన్స్‌ని షాక్‌కి గురిచేసింది. ఈ జంట విడాకులు తీసుకున్న తర్వాత ఇటు నిహారిక కానీ, అటు చైతన్య కానీ స్పందించలేదు. తాజాగా నిహారిక తాను విడాకులు తీసుకోవడం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘జీవితంలో ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మకూడదు. విడాకులతోనే జీవితం ముగిసిపోయినట్లుగా నేను అనుకోను. పెళ్లి తర్వాత జరిగినవి ఓ అనుభవ పాఠాలుగా మార్చుకుని ముందుకు సాగుతున్నా. ఎవరి జీవితంలోనైనా పెళ్లి ఎంతో ముఖ్యమైన ఘట్టం. కలకాలం కలిసే ఉంటాం అనే అందరూ పెళ్లి చేసుకుంటారు. కానీ ఏడాదిలోనే విడాకులు తీసుకుంటాం అని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. నేను అలాగే ఆలోచించా. కానీ నేను ఊహించినట్లుగా జరగలేదు. ఎవరు ఏమన్నా అనుకోని.. నా గురించి నా ఫ్యామిలీ ఏమనుకుంటారు అన్నదే నాకు ముఖ్యం. అని నిహారిక మాట్లాడారు.
