న్యూఢిల్లీ : బిజెపి ఎంపి కంగనా రనౌత్, ఎల్‌జిపి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌ల గురించి ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కంగనా, చిరాగ్ పాశ్వాన్‌లు 2011లో ‘మిలే నా మిలే హమ్’ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక కంగన హిమాచల్‌ప్రదేశ్‌లో మండి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. వీరిద్దరూ ఎంపీలుగా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు.
