గొప్ప మనసు చాటుకున్న శ్రీలీల

Mar 5,2024 12:10 #movie, #srileela

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరోయిన్‌ శ్రీలీల ‘పెళ్లి సందడి’ మూవీతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీతో హిట్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక బాలకృష్ణకు కుమార్తెగా ‘భగవంత్‌ కేసరి’ మూవీలో తన నటనేంటో నిరూపించింది. నటనా ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ సినీ ఇండిస్టీలో మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు చిన్నారులకు తన ప్రేమను పంచుతూ ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవరైనా చిన్నారులకు కానీ, అనాథశరణాలయాలకు ఆర్థికసాయం చేస్తారు. కానీ శ్రీలీల మాత్రం చిన్నారులను చేరదీసి..వారి ఆలనా పాలనా తనే దగ్గరుండి చూసుకుంటుంది. తనకు 18 ఏళ్ల వయసులోనే ఇద్దరి చిన్నారులరు చేరదీసిన శ్రీలీల… తాజాగా మరో పిల్లవాడిని కూడా చేరదీసింది. ఆ పిల్లవాడికి ఫేస్‌ డ్యామేజ్‌ అయింది. ఆ పిల్లాడిని ఎత్తుకుని నవ్వించే ప్రయత్నం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘నిజంగా నీది గొప్ప మనసు’ అని శ్రీలీలని తెగ పొగిడేస్తున్నారు.

 

 

➡️