‘అలనాటి రామచంద్రుడు’ పాట వస్తుండగా… థియేటర్లోనే ప్రేమజంట పెళ్లి…!

అమరావతి : ప్రిన్స్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు వేళ …. నేడు మురారి, ఒక్కడు సినిమాలను వరల్డ్‌ వైడ్‌గా రీరిలీజ్‌ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో మహేష్‌ అభిమానుల సందడి నెలకొంది. అయితే …. మురారి సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ఓ వినూత్న ఘటన జరిగింది. ప్రత్యేకంగా మురారిలోని పాటలు అన్నీ సూపర్‌ హిట్‌. మరి ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడు’ పాట ఎంతో ఫేమస్‌. ఎక్కడ పెళ్లి జరిగినా ఈ పాట తప్పనిసరిగా ప్లే అవుతుంది. కాగా మురారి రీరిలీజ్‌ అయిన ఓ థియేటర్‌ లో ఓ ప్రేమ జంట అలనాటి రామచంద్రుడు పాటలో సోనాలి, మహేష్‌ మాదిరి పెళ్లి చేసుకున్నారు. ఇహ ఆ థియేటర్‌ అంతా సందడి చేసింది. ఆ ప్రేమ జంట పెళ్లిని ఫ్యాన్స్‌ కెమెరాలో షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ గా మారింది. అలాగే కొన్ని థియేటర్స్‌ లో అక్షింతలు కూడా చల్లుకుంటూ, స్వీట్లు పంచిపెడుతూ, డ్యాన్సులు వేస్తూ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు.

➡️