Jun 23,2022 09:45
  •  అనర్హుల జాబితాను ప్రకటించని ప్రభుత్వం
  •  27న తల్లుల ఖాతాలోకి డబ్బులు

ప్రజాశక్తి - అమరావతి : అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టనుంది. ఎపిలో అమ్మ ఒడి పథకం మూడో విడత నిధుల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 27న అమ్మఒడి పథకం నిధుల ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రతి సంవత్సరం రూ.15 వేలు తల్లుల ఖాతాలో వేసే ప్రభుత్వం ఈ ఏడాది రూ. 13 వేలను ప్రభుత్వం జమ చేయనుంది. నిర్వహణ పేరుతో రూ.2వేల కోత పెట్టింది. ఈ ఏడాది అమ్మ ఒడి పథకం లబ్దిదారుల సంఖ్యలో వివిధ కారణాలతో లక్ష మందికి కోత పడినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ కారంణంగా పాఠశాలలకు గైర్హాజరు కావటంతో 51 వేల మందికి అమ్మఒడి పథకానికి అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. మిగతా 50 వేల మంది పైచిలుకు విద్యార్ధులకు వేర్వేరు కారణాలతో పథకం నిలిపివేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అర్హుల జాబితాను పంపించిన ప్రభుత్వం.. అనర్హుల జాబితాను మాత్రం ఇవ్వలేదు. దీంతో జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు.