Jul 29,2021 23:25

ప్రజాశక్తి-చీరాల రూరల్‌: చీరాల మండల పరిధిలోని కాపూరివారిపాలెం పంచాయతీ పరిధిలోని పాలిబోయినవారిపాలెంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల 10 పూరిళ్లు, గడ్డివాములు గురువారం దగ్ధమయ్యాయి. ఈపురుపాలెం ఎస్‌ఐ సుబ్బారావు సిబ్బందితో ఘటనాస్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. చీరాల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటం సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.