Mar 27,2023 21:45

104 వాహనాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్ససత్యనారాయణ

ప్రజాశక్తి-గరివిడి : జిల్లాకు కేటాయించిన 19 వాహనాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం గరివిడి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆసుపత్రిలో వైద్యం అందించడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ల విధానం ద్వారా గ్రామాల్లో సైతం సేవలు అందిస్తున్నామని తెలిపారు. చీపురుపల్లి పరిధిలో శ్రీ ఆదర్శ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఎంపి ల్యాండ్‌ నిధులతో నిర్మించిన బస్టాండ్‌ను మంత్రి బొత్స, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎంపిపి ఇప్పిలి వెంకటనరసమ్మ, జెడ్‌పిటిసి వాకాడ శిరీష. గరివిడి ఎంపిపి మీసాల విజయలక్ష్మి. జడ్‌పిటిసి వాకాడ శ్రీనివాసరావు, మెరకముడిదాం ఎంపిపి తాడ్డివేణు, తదితరులు పాల్గొన్నారు.