ప్రజాశక్తి - కాకినాడ
104 వాహనాలతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయనిరాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. సోమవారం కాకినాడ ఆర్‌ఎంసీ వద్ద 15 సంచార వైద్య సేవల 104 వాహనాలను మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపి వంగా గీత, జడ్‌పి ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్‌పి ఎం.రవీంద్రనాథ్ బాబు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. మంత్రి రాజా మాట్లాడుతూ 104 వాహనాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని గత మూడే ళ్లలో 11 లక్షల మందికి పైగా ఈ వాహనాల ద్వారా సేవలు అందినట్లు తెలిపారు. మరో 15 వాహనాలు కొత్తగా అందుబాటులోకి రావడం వల్ల ఈ సేవలు మరింత విస్తతం కానున్నా యని వివరించారు. ప్రతి హెల్త్ క్లినిక్ పరిధిలో నెలకు రెండుసార్లు ప్రజలకు 104 సేవలు అందు బాటులో ఉంటాయని తెలిపారు. ఎంపీ గీత మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు సైతం ఆరోగ్యసేవలు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. గ్రామ స్థాయిలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నట్లు వెల్లడించారు. 108, 104 వాహనాల సంఖ్యను పెంచడంతో మరింత మందికి వైద్య సేవలను చేరువచేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని వ్యాధులను చేర్చ డంతో పాటు ఈ పథకం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందేలా చూస్తున్నట్లు వెల్లడించారు.
ఫ్యామిలీ డాక్టర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ కృతికా శుక్లా
కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 104 వాహనాలు 20 ఉన్నాయని ఇవి ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయని కొత్తగా మరో 15 వాహనాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి నెలా లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడిం చారు. ఈ 104 వాహనాలను ఫ్యామిలీ డాక్టర్ విధానంతో అనుసంధానించి జిల్లాలో విజయవంతంగా ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్లు వివరించారు. 104 వాహనాల ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశ ముందని ఈ వాహనాల్లో 75 రకాల మందులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. బీపీ, మధుమేహం, వివిధ ఇతర అనారోగ్య సమస్యలు బారినపడిన వారికి ఈ సేవలు అందుతున్నాయని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఆర్.రమేష్, డిఎస్‌పి పి.మురళీకృష్ణారెడ్డి. డిప్యూటీ డిఎంహెచ్‌ఒ (పెద్దాపురం) డాక్టర్ సరిత, డెమో పసాద్‌రాజు, 108, 104 జిల్లా మేనేజర్లు సీహెచ్ అవినాశ్, కె.వీరబాబు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది హాజరయ్యారు.
104 వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపి గీత, కలెక్టర్ కృతికా శుక్లా