Oct 03,2022 22:52

పెదపూడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధిత డ్వాక్రా మహిళలు

- యూనియన్‌ బ్యాంకు బిసి పాయింట్‌ నిర్వాహకుడు నిర్వాకం
- శహపురం ఎంపిటిసి పార్వతి ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు
ప్రజాశక్తి - పెదపూడి:
కాకినాడ పెదపూడి మండలం శహపురం గ్రామ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బీజినెస్‌ కరస్పాండెంట్‌ (బీసీ పాయింట్‌ ) నిర్వా హకుడు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు శహపురం గ్రామ ఎంపిటిసి సభ్యురాలు చందళ్ల పార్వతీ, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఆరో పించారు. ఈ సంఘటనపై వారు పెదపూడి పోలీస్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సంపర యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు అనుబంధంగా శహపురం గ్రామంలో గుత్తుల కుమారస్వామి అనే వ్యక్తి నిర్వహిస్తున్న బిసి పాయింట్లో గ్రామంలోని 105 డ్వాక్రా సంఘాల మహిళలు పొదుపు, రుణాలు ప్రతి నెల చెల్లిస్తుంటారు. వినియోగదారులు లావా దేవీలు నిర్వహించుకుంటున్నారు. అయితే గత రెండు నెలలుగా డ్వాక్రా మహిళలు ఈ బిసి పాయింట్‌ బ్యాంక్లో పొదుపు, రుణాలు చెల్లించినప్పటికీ బ్యాంక్‌ పాస్‌ పుస్తకంపై ప్రింటింగ్‌ వేయకుండా పెన్నుతో రాసి మీ నగదు ఖాతాలో జమ అయింది అని ఖాతాదారు లందరినీ నమ్మ పలుకుతూ వచ్చాడన్నారు. అయితే డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఇక్కడ ప్రింటింగ్‌ వేయడంలేదని సంపర యూనియన్‌ బ్యాంక్‌ వద్దకు వెళ్లి ప్రింటింగ్‌ వేయమని అక్కడ అధికారులను అడిగిన ప్పటికి వారు స్పందించలేదని మహిళలు ఆరోపిస్తు న్నారు. అయితే వారం రోజులుగా బిసి పాయింట్‌ నిర్వాహకుడు కుమారస్వామి బీసీ పాయింట్ను మూసివేయడంతో అనుమానం వచ్చిన డ్వాక్రా సంఘాల మహిళలు సంపర బ్యాంకు శాఖలో అధికారులను గట్టిగా నిలదీయడంతో వివరాలను పరిశీలించిన అధికారులు గ్రామంలో మొత్తం 67 డ్వాక్రా సంఘాలకు సంబంధించి సుమారు రూ.26 లక్షలు గత రెండు నెలలుగా చెల్లింపులు చేయలేదని తెలిపారన్నారు. దీంతో ఆందోళనకు గురైన మహిళలు లబోదిబోమంటున్నారు. ఎంతో క్రమశిక్షణతో తిని తినక రుణాలు చెల్లించే చెల్లిస్తున్నామని బీసీ పాయింట్‌ నిర్వహకుడు నమ్మకంగా తమను మోసం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపిటిసి చందర్ల పార్వతి ఆధ్వర్యంలో మహిళలు భారీగా పెదపూడి పోలీస్‌ స్టేషన్‌కు తరలి వెళ్లారు. తమను మోసం చేసిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంపర శాఖ బీసీ పాయింట్‌ నిర్వాహకుడు కుమారస్వామితో పాటు అతనికి సహకరించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని, తమ సొమ్ములను ఇప్పించి తమకు న్యాయం చేయాలని, దోషులను కఠిన చర్యలు తీసుకో వాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.