Aug 09,2022 18:45

హన్సిక మోట్వాని ప్రధాన పాత్రలో రుధ్రాన్ష్‌ సెల్యూలాయిడ్‌ పతాకంపై ఒకే పాత్రతో సింగిల్‌ షాట్‌ ఫార్మేట్‌లో నిర్మించిన చిత్రం '105 మినిట్స్‌'. బొమ్మక్‌ శివ నిర్మాణంలో దర్శకుడు రాజు దుస్సా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంగళవారం హన్సిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''మా హీరోయిన్‌ హన్సికకు టీమ్‌ అందరి తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలో టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమాలుంటాయి. వైవిధ్యభరితమైన కథా కథనాలతో '105 మినిట్స్‌'ను రూపొందిస్తున్నాం. ఒకే పాత్రతో సాగే ఈ సినిమాలో హన్సిక నటన మెస్మరైజ్‌ చేస్తుంది'' అని చెప్పారు.