Jan 05,2021 15:39

ముంబయి : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త ఫీచర్లతో మరో కొత్త రకం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొత్త సంవత్సరం తొలి వారంలోనే 108 మెగాపిక్సెల్‌ రిజల్యూషన్‌ కలిగిన కెమెరాతో ఎంఐ 10ఐ 5జీ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను విడుదల చేసింది. షియోమీ ఎంఐ 10 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఎంఐ 10టి, ఎంఐ 10టి ప్రో, ఎంఐ 10 5జీ మోడళ్లను కంపెనీ మార్కెట్‌లోకి వదిలింది. తాజాగా విడుదల చేసిన ఎంఐ 10ఐ 5జీ ప్రారంభ ధర రూ.20,999గా నిర్ణయించారు. ఐసిఐసిఐ బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాకండా రూ.10 వేల విలువైన రిలయన్స్‌ జియో ప్రయోజనాలు కూడా పొందవచ్చని పేర్కొంది. కాగా ఎంఐ 10ఐ మూడు స్టోరేజ్‌ వేరియంట్లలో లభిస్తుంది. 6 జిబి ర్యామ్‌తో పాటు 64 జిబి స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.20,999, 6 జిబి ర్యామ్‌తో పాటు 128 జిబి స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.21,999గా ఉండగా, 8 జిబి ర్యామ్‌తో పాటు 128 స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.23,999గా నిర్ణయించారు.

ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్స్‌..
డిస్‌ప్లే : 6.67 అంగుళాలు
ప్రాసెసర్‌ : క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జి
ఫ్రంట్‌ కెమెరా : 16 మెగా పిక్సెల్‌
రియర్‌ కెమెరా : 108 మెగా పిక్సెల్‌
ర్యామ్‌ : 6 జిబి
స్టోరేజ్‌ : 128 జిబి
బ్యాటరీ కెపాసిటి : 4820 ఎంఎహెచ్‌
ఓఎస్‌ : ఆండ్రాయిడ్‌