Jun 11,2021 21:59

లండన్‌ : వచ్చే ఏడాదిలోగా 10కోట్ల మిగులు వ్యాక్సిన్‌ డోసులను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని బ్రిటన్‌ హామీ ఇచ్చింది. జి7 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన ప్రారంభోపన్యాసంలో ఈ విషయం వెల్లడించారు. బ్రిటన్‌, ఇతర సంపన్న దేశాలు కలసి వందకోట్ల డోసులు, తగు రుణ సాయం అందించేందుకు జి-7 ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుండి మానవాళిని రక్షించే చర్యల్లో బ్రిటన్‌ అగ్ర స్థానంలో వుందని జాన్సన్‌ పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ అభివృద్ధికి నిధులు సమకూర్చామని తెలిపారు. ఇప్పటివరకు 160 దేశాల్లో యాభై కోట్ల డోసులకు పైగా వేశారని తెలిపారు.