
ప్రజాశక్తి-బి.కొత్తకోట :స్విమ్స్, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి సహకారంతో స్థానిక ప్రభుత్వాస్పత్రి ఆవరణంలో ఈ నెల 10వ తేదీన ఉచిత కేన్సర్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కమిషనర్ నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ కేన్సర్ వ్యాధి అత్యంత ప్రమాధికారిగా మారిందని, ప్రాథమికంగా గర్తించకపోవడంతో ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయన్నారు. 40 ఏళ్లు దాటిన మహిళలకు ఉచితంగా కేన్సర్ వ్యాధి నిర్దారణ వైద్యశిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో పింక్ బస్ ద్వారా మహిళా వైద్యుల పర్యవేక్షణలో సుమారు రూ.7 వేల నుండి రూ.10 వేల వరకు ఖర్చయ్యే మహిళల్లో సంక్రమించే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారా కేన్సర్, నోటి కేన్సర్ సంబంధించిన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని 40 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.